షుగర్ ఇన్సులిన్ ఇక ట్యాబ్లెట్‌లలో!

సాధారణంగా ఇప్పుడు వచ్చే రోగాలలో షుగర్ వ్యాధిని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఆహార అలవాట్ల మార్పిడి వల్ల సమయానికి సరిగా తినకపోవడం వల్ల మధుమేహ వ్యాధి సంభవించవచ్చు. అయితే షుగర్ తో భాదపడుతున్న వారికి శుభవార్త!  మధుమేహంతో భాధపడేవారు క్రమం తప్పకుండా ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ను ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాస్త నొప్పితో కూడుకున్న వ్యవహారం. అయితే ఈ నొప్పి నుంచి త్వరలోనే ఉపశమనం కలగనుంది. ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌కు బదులుగా సరికొత్త ట్యాబ్లెట్‌ను ఎంఐటీ, హార్వర్డ్‌, నోవో నోర్‌డిస్క్‌ పరిశోధకులు తయారు చేశారు.

ఇవి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో ఇన్సులిన్‌, కేన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే యాంటీబాడీ్‌స(ప్రతిరోధకాలు) త్వరగా కరిగిపోయి.. వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అయితే, జీర్ణవ్యవస్థలో చేరాక కూడా ఇన్సులిన్‌ ప్రభావాన్ని కోల్పోకుండా ఉండే విధంగా ఈ సరికొత్త ట్యాబ్లెట్‌ను వీరు రూపొందించారు. తాబేలును ఆకారంలో ఉండే ఈ ట్యాబ్లెట్‌.. పేగుల గుండా వెళ్లి ఇన్సులిన్‌ను శరీరంలోకి ప్రవేశపెడుతుంది. ఆ తరువాత వ్యర్థాల రూపంలో బయటకు వచ్చేస్తుందని తెలియచేసారు. ఈ ప్రయోగాన్ని జంతువులపై జరపగా సానుకూల ఫలితాలు రావడం జరిగిందన్నారు.

leave a reply