టీడీపీదే ఆధిక్యం..!

కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకే సమయంలో జరగడటంతో ఒక్కసారిగా అన్ని పార్టీలు వ్యూహ,ప్రతివ్యూహాలకు పదును పెట్టాయి. ఈ సమయంలో జాతీయ మీడియా సంస్థలు అయిన రిపబ్లిక్ టీవీ మరియు సీ ఓటర్ సంయుక్తంగా విడుదల చేసిన సర్వే వివరాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లో 14 స్థానాల్లో టీడీపీని విజయం వరిస్తుందని,వైసీపీ 11 స్థానాల్లో విజయం సాదిస్తుందని సర్వే అంచనా వేసింది.

leave a reply