బ్యాలెట్‌ పేపర్లో నోటా గుర్తు..!

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నాగిరెడ్డి. మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఎన్నికల గురించి వివరించారు. మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని.. జనవరి 21న తొలివిడత ఎన్నికల పోలింగ్, జనవరి 25న రెండో విడత ఎన్నికల పోలింగ్, జనవరి 30న మూడో విడతతో పోలింగ్‌ ముగుస్తుందన్నారు.

కాగా.. మొత్తం 1,49,52,58 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఆ తర్వాత ఓటర్లు ఉంటే ప్రత్యేక జాబితా ఉండనుందన్నారు. ఈ నెల 21, 25, 30 తేదీల్లో పోలింగ్‌ ఉంటుందన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలింగ్‌ ఉండనుందని, అదే రోజ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు వెలువరిస్తామని నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,13,190 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 19 పంచాయతీల్లో తప్ప రాష్ట్రమంతా ఎన్నికలు ఉంటాయన్నారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రధానమైన అంశం ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో నోటా గుర్తును ఉంటుందని స్పష్టం చేశారు.

leave a reply