హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి-యరపతినేనీ

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేత జగన్ పై నిప్పులు చెరిగాడు. జగన్ పై తీవ్ర విమర్శలు చేశాడు. జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ.. జగన్ పల్నాటి గడ్డపై మరోసారి టిడిపి పైన విషం కక్కాడు అని విమర్శించాడు. జగన్ దొంగ పలుకులతో పల్నాటి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు కానీ అది జరగని పని అని అయ్యన అన్నాడు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఏ ఒక్కరిని అడిగినా నీ రౌడీ కుటుంబనేపథ్యం చెబుతారు అంటూ జగన్ పై మండిపడ్డాడు. సరస్వతి సిమెంటు కంపెనీ పేరుతో రైతుల భూములు కాజేసిన దొంగవి నువ్వు.. హత్యారాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం అంటూ ఆయన కుటుంబం పై కూడా నిప్పులు చెరిగాడు. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక చౌకబారు విమర్శలు జగన్ చేస్తున్నాడు అని ఆయన అన్నారు. జగన్ కు ధైర్యం ఉంటే నా పైన పోటీ చేయాలని గతంలోనే సవాల్ చేశాను…జగన్ కు దమ్ము లేక నా పైన తన చెంచాను పోటీ లో పెట్టాడు అంటూ వ్యంగ్యంగా తీసిపారేశాడు. జగన్ ఆటలను పల్నాటి గడ్డ పైన సాగనివ్వను..టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అన్నారు.

leave a reply