తెలుగులోనే ప్రసంగం మొదలు పెట్టిన నరేంద్రమోడీ.

హైదరాబాద్ ఎల్ .బి నగర్ స్టేడియంలో నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం.

హైదరాబాద్: భాగ్యనగరం అంటే తనకు ఎంతో ప్రియమని ప్రధాని నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలుగులోనే ప్రసంగం ప్రారంభించి అందరిని ఆకట్టుకున్నారు. సర్దార్ వల్లబాయ్‌ పటేల్ గురించి మాట్లాడుతూ పటేల్ లాంటి గొప్పవారు లేకపోతే తెలంగాణలో ఇలా మాట్లాడే స్వేచ్ఛ కలిగేదే కాదన్నారు. సర్ధార్ పటేలే తనకు ఆదర్శమన్నారు. భాగ్యనగరానికి ఎప్పుడు వచ్చిన పటేలే గుర్తుకు వస్తారని చెప్పారు.

సభకు తరలి వచ్చిన యావత్ ప్రజానీకాన్ని, ఈ భాగ్యనగరానన్ని చూస్తుంటే బీజేపీ గెలుపు ఖాయమ్ అని తెలుస్తోందన్నారు . పటేల్ వల్లే హైదరాబాద్‌‌కు విముక్తి లభించిందని మోదీ చెప్పుకొచ్చారు. ఆన రోజుల్లో పటేల్ లేకపోతే.. ఈనాడు తెలంగాణ ఇలా ఉండేదే కాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ ఎన్నికల నుంచే దాన్ని తుంచేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు.

 

leave a reply