రాములక్క మంతనాలు

జయలలిత మరణం తర్వాత తమిళనాడులో అత్యంత కీలకమైన ఘటనలు చాలా జరిగాయి. పార్టీ రెండుగా చీలడం.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలు కెళ్లడం జరిగాయి. అయితే ఇప్పుడు మళ్లీ శశికళ తెరపైన కనిపించడం అందరినీ ఆలోచింపజేస్తుంది.

జైలు శిక్ష అనుభవిస్తున్నఅన్నాడీఎంకే నేత శశికళతో కాంగ్రెస్ నేత విజయశాంతి భేటీ అయ్యారు. కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్న శశికళతో విజయశాంతి గంటకు పైగా భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫెడరల్ ఫ్రంట్‌పై శశికళ ఆరా తీసినట్టు సమాచారం. ఆ కూటమిలో చేరితే ఎలా ఉంటుందన్న విషయంపైనా విజయశాంతితో శశికళ చర్చించినట్టు తెలుస్తోంది.

శశికళతో విజయశాంతికి చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెను విజయశాంతి పలుమార్లు కలిశారు. ఇటీవల ఆర్కేనగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో శశికళ బంధువు దినకరన్‌కు మద్దతుగా విజయశాంతి ప్రచారం కూడా నిర్వహించారు. వీరిద్దరి తాజా కలకయిక మరోమారు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే శశికళ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారా? లేక తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ యేతర ఫెడరల్ ఫ్రంట్‌పై గురిపెడతారా..? లేదా మామూలుగానే శశికళ క్షేమసమాచారాల గురించి రాములక్క ముచ్చట పెట్టి వచ్చిందా..? ఇలా చాలా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

leave a reply