అగ్రస్థానం వదలని…కోహ్లీ!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బ్యాట్స్ మెన్ జాబితాలోనే కాదు బ్రాండ్ వివిలువలోను తనదైన ముద్ర వేసాడు. వరుసగా రెండో ఏడాది దేశంలో ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ సెలబ్రిటీ బ్రాండ్‌’గా నిలిచాడు. వివిధ వాణిజ్య సంస్థలకు చేస్తున్న ప్రచారాన్ని లెక్కలోకి తీసుకొని ప్రముఖ గ్లోబల్‌ వాల్యుయేషన్, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సలహాదారు సంస్థ ‘డఫ్‌ అండ్‌ ఫెల్ఫస్‌’ తాజా నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా 18 శాతం పెరుగుదలతో 2018లో కోహ్లి బ్రాండ్‌ అగ్రస్థానంలో ఏకంగా దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) వరకు చేరింది. కోహ్లీ గత సంవత్సరం వరకు 24 ఉత్పత్తులకు ప్రచార కర్తగా ఉన్నాడు.

దీంతో ఈ జాబితాలో భారత కెప్టెన్‌ అగ్రస్థానం మరింత బలంగా మారింది. ఈ జాబితాలో కోహ్లి తరవాతి స్థానంలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనె నిలిచారు. ఇదే సమయానికి 21 ఉత్పత్తులను ఎండార్స్‌ చేస్తున్న బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌ రూ.718 కోట్ల (102.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) బ్రాండ్‌ విలువతో వచ్చే ఆదాయంతో రెండో స్థానం దక్కించుకుంది. తరువాతి స్థానంలో బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (రూ.473 కోట్లు), రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.443 కోట్లు) మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు. అయితే 2017 లో రెండో స్థానంలో ఉన్న షారుక్ ఖాన్ ఐదో స్థానానికి పడిపోయాడు.

leave a reply