ఆ నిర్ణయం… అందుకే!

న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని తెలిసిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచినా బ్యాటింగ్‌ ఎంచుకొని ఆశ్చర్యానికి గురి చేసాడు. దీనిపై కెప్టెన్ రోహిత్ మాట్లాడుతూ …. నాలుగో వన్డేలో 92 పరుగులకే కుప్పకూలడంతో మరోసారి తమను తామను పరీక్షించుకోవాలనే ఉద్దేశంతోనే  బ్యాటింగ్‌ ఎంచుకున్నట్లు తెలిపాడు. టాస్ గెలవక ముందు పిచ్ ను పరిశీలించాను కానీ అది ముందు బౌలింగ్ కి అనుకూలిస్తుందని అర్ధమైంది కానీ మమ్మల్ని మేం పరీక్షించుకోడానికే బ్యాటింగ్ ఎంచుకున్నామని తెలిపాడు.

త్వరలో ప్రపంచకప్‌ జరగబోతుందని అందులో మాకు ఇలాంటి పరిస్థితులే ఎదురుకావొచ్చు అందుకు తగ్గట్టుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నామని తెలిపాడు. అయితే ఆ మ్యాచ్ లో మేం త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోయిన  మాట నిజమే. బంతి స్వింగవుతున్నప్పుడు ఎలా బ్యాటింగ్‌ చేయాలో మాకు తెలిసింది మాకిప్పుడు కఠిన పరిస్థితులలో  ఏం చేయాలో తెలుసు. మొదట మా బ్యాటింగ్ అంత గొప్పగా ఎం లేదు ఆ తరువాత  మేం 250 దాటాం, ఆ పరుగులే మా విజయంలో కీలకమయ్యాయి అని ఐదో వన్డేలో విజయం అనంతరం రోహిత్‌ పేర్కొన్నాడు.

leave a reply