పుజారా శతకం..టీమిండియా గట్టెక్కేనా !

తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడపడింది.

అడిలైడ్‌:తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తడపడింది ఓపెనర్లు కె.ఎల్ రాహుల్ , మురళివిజయ్ ల వికెట్స్ త్వరగా కోల్పోయింది.ఆదుకుంటాడు అని అనుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని కూడా ప్రత్యర్థి జట్టు పెవిలియన్ పంపించడంలో విజయం సాధించింది. అయితే పుజారా శతకంతో టీమిండియా కొంత ఉపిరి పీల్చుకుంది.పుజారా 153 బంతుల్లో 4ఫోర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేసి.టెస్టుల్లో 20వ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఓ వైపు వికెట్లు పడిపోతున్నప్పటికీ.పుజారా నిలకడగా ఆడుతూ స్కొరు బోర్డును కదిలి  కదిలించాడు.అంతకముందు రోహితశర్మ మూడు సిక్సులు రొండు బౌండరీలు సాధించి పెవిలియన్ బాట పట్టాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు.

రహానే కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు.అశ్విన్, పుజారా కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసారు.కానీ కమ్మిన్స్ వారి భాగస్వామ్యానికి అడ్డుకట్టవేశాడు,వెనువెంటనే టీమిండియా ఒక్కో వికెట్ కోల్పోయింది.మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 250/9 సాధించగలిగింది.పుజారా 123 రన్స్ చేసి రనౌట్ గా వెనుదిరిగాడు.

leave a reply