రెడ్మి నోట్ 7…సరికొత్తగా!

రెడ్మి నోట్ 48 మెగా పిక్సల్స్ కెమెరాతో నోట్ 7 ను విడుదల చేసింది. కొన్ని రోజుల ముందు మనం “కంప్యూటర్ ఎరా” లో చెప్పుకున్నట్టు రెడ్మి నోట్ 7 తాజాగా మార్కేలోకి వచ్చింది. అయితే ఈ మొబైల్ ప్రతుతం చైనాలోనే లభిస్తుంది.. కానీ జనవరి నెలాఖరుకు గాని, ఫిబ్రవరిలో గాని భారతీయ మార్కెట్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీని పనితీరు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆధారంగా ఉంటుందని, ఈ మొబైల్ ధర పది వేల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అనేక ఉపయోగకర సదుపాయాలతో 2019 లో రాబోతున్న ఈ మొబైల్ మెరుగైన బడ్జెట్ విలువ కూడా తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో AI స్క్రీన్ డిటెక్షన్, AI పోర్ట్రయిడ్ మోడ్ వంటి సదుపాయాలు కలిగిన MIUI కెమరాతో ఇది మనకు లభిస్తుంది.


ఈ మొబైల్ 6.3 అంగుళాల స్క్రీన్ కలిగి, 3 జీబీ RAM , 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ పది వేల రూపాయలు, మరియు 4 జీబీ RAM, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ సుమారు పద్నాలుగు వేళా రూపాయలు ఉండవచ్చని అంచన. మరి కొన్ని రోజులలో విడుదల కాబోతున్న రెడ్మి నోట్ 7, నోట్ ప్రో లలో 48 మెగా పిక్సెల్ ఆకర్షణగా నిలవబోతుంది. అయితే మొబైల్ ముందు భాగంలో పదమూడు మెగా పిక్సెల్ తో సెల్ఫీ కెమెరా ఉండనుంది.

leave a reply