టీ 20 క్రికెట్ అనగానే ముందు గుర్తొచ్చేది వెస్టిండీస్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్కోరును పరుగులు పెట్టించే గేల్ వరల్డ్‌కప్ తర్వాత వన్డే ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పబోతున్నట్లు తెలిపాడు. గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇతడు ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపికైన గేల్ తనకు ప్రపంచకప్ చివరి వన్డే టోర్నీ అని తెలిపాడు. ఇందులో భాగంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ మాట్లాడుతూ… వరల్డ్ క్రికెట్‌లో తానే గ్రేట్ ప్లేయర్‌నంటూ గేల్ చెప్పుకొచ్చాడు. ‘ మీరు గొప్ప వ్యక్తిని చూస్తున్నారు. నేను వరల్డ్ క్రికెట్‌లో గొప్ప క్రికెటర్‌ని. ఇప్పటికీ నేనే యూనివర్శ్ బాస్‌ను. అది ఎప్పటికీ మారదు’ అని గేల్ తెలియచేసాడు.
అయితే వరల్డ్‌కప్ తర్వాత మీరు వన్డేల్లో మీరు ఆడటం లేదా అన్న ప‍్రశ్నకు గేల్ సమాధానమిస్తూ… “నా వన్డే క్రికెట్ అనేది వరల్డ్‌కప్‌తో ముగుస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. యువ క్రికెటర్లకు మార్గదర్శకంగా మారతానని. వారి ఆటను ఎంజాయ్ చేస్తూ ఉంటానని, గేల్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌తో బుధవారం నుంచి ఆరంభం కానున్న వన్డే సిరీస్‌పై గేల్ కసరత్తులు ప్రారంభించాడు. ఇక్కడ సత్తాచాటడమే కాకుండా అదే ఫామ్‌ను వరల్డ్‌కప్‌లోనూ కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.