స్వీట్ కార్న్ అంటే ఇష్టపడని వారెవరు ఉండరు. సాయంత్రం సమయంలో స్నాక్స్ గా వీటిని తీసుకుంటారు. ఇవి రుచితో పటు ఆరోర్యాన్ని కూడా ఇస్తాయి. మొక్కజొన్నలో పీచుశాతం అధికంగా ఉండటమే కాక, పిండి పదార్ధాలతో పాటు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజు ఆహారంలో చేర్చుకుంటే జీర్ణక్రియ పనితీరు మెరుగు పడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. చిన్నారులకు తినిపించినా త్వరగా అరుగుతుంది.
మొక్కజొన్నలో గ్లూటిన్ ఉండదు. కాబట్టి గోధుమ పిండికి బదులుగా ఉపయోగించవచ్చు. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సూప్‌ల తయారీలోనూ వాడుకోవచ్చు. ఇది ఎముకలకు బలాన్నిఇస్తూ అవి గట్టిగా అయ్యేలా తోడ్పడుతుంది. ఫలితంగా భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ సమస్య ఎదురుకాకుండా ఉంటుంది.
రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్య తగ్గుతుంది. రక్తహీనత సమస్య కూడా అదుపులో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. పైగా దీనివల్ల చర్మ సమస్యలు కూడా అదుపులో ఉంటాయి. ఇది మధుమేహాన్నే కాదు… అధికరక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.