‘అరసవిల్లి సూర్యనారాయణ’ క్షేత్రం

సూర్యుడు లేకపోతే ఈ విశ్వమంతా చీకటిలోనే బతకాల్సివచ్చేది. ఆదిదేవతలకు దేవుడు సూర్యనారాయణుడుగా పురాణాల ప్రకారం చెప్పబడుతుంది. అలాంటి సూర్యభగవానుడు స్వయంగా భక్తులకు దర్శనమిచ్చే క్షేత్రం అరసవిల్లి. అరసవిల్లి శ్రీ సూర్యభగవానుడు ఆలయం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ధి చెంది ఉంది. ఒకప్పుడు ఈ గ్రామాన్ని “హర్షవల్లి” అనేవారని, క్రమ క్రమంగా “అరసవిల్లి” అయిందని చెపుతారు.

చరిత్ర ప్రకారం.. ప్రాచీన దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుంది. ఇక్కడ లభించిన శాసనాల ప్రకారం ఈ ఆలయం క్రీ.శ. 7 వ శతాబ్థానికి చెందినదిగా చెబుతారు. ఈ స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థలపురాణం ద్వారా తెలియుచున్నది. భారతదేశంలో ఉన్న కొద్ది సూర్యదేవాలయాలలో ఇది ఒకటి. కాలానుగుణంగా.. షేర్‌ మహమ్మద్‌ ఖాన్‌ పరిపాలనలో ఈ ప్రాంతంలోని పలు ఆలయాలను ధ్వంసం చేశారు. అలాగే అప్పడున్న ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి సూర్య విగ్రహాన్ని  బాలిలో పడేశారట. కాగా.. ఎలమంచి పుల్లజీ పంతులు అనే ఆయన బావిలో సూర్యనారాయణ విగ్రహం లభించగా.. ఇప్పుడున్న రీతిలోనే దేవాలయాన్ని నిర్మించి, అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ, అశేషంగా భక్తులనెందరినో ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రముగా వెలుగొందుతూ ఉంది.

ఈ ఆలయం మొక్క ముఖ్య ప్రత్యేకతలు ఏమనగా.. ఈ దేవాలయంలోని సంవత్సరానికి రెండుసార్లు సూర్య కిరణాలు ఉదయ సంధ్యలో మూలవిరాట్టు పాదాలకు సోకేలా ఈ దేవాలయం నిర్మించబడటం. దేవాలయ వాస్తులో యిదో ప్రత్యేకత. కంచి లోని కామేశ్వరాలయంలో కూడా యిలాంటి ఏర్పాటు ఉంది. ప్రతి సంవత్సరం మార్చి, అక్టోబర్ లలో ఇది జరుగుతుంది. ఈ వింతను చూడటానికి పెద్ద ఎత్తులో భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటారు.

leave a reply