ఇల్లీ బేబీ లొల్లి..

‘దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెత చిత్ర పరిశ్రమకు సరిగ్గా సరిపోతుంది. అవకాశాలు ఉన్నప్పుడే వాటిని మన వసం చేసుకోవాలి కానీ.. ఇప్పుడొచ్చి ఏడిస్తే ఏం లాభం కదా.. ప్రస్తుతం ఇల్లీ బేబీది ఇదే పరిస్థితి. తెలుగులో మంచి క్రేజ్‌, అవకాశాలు ఉన్నప్పుడు బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ ‘ బర్ఫీ’ సినిమాతో మంచి విజయం అందుకుంది. కానీ ఆ తర్వాత వరుస అపజయాలతో ఇల్లీ బేబీ ఇంట్లోనే సెటిల్‌ అయిపోయింది. ఇక మరో దారి లేక దక్షిణాది చిత్రాలపై దృష్టి సారించింది ఇలియానా బ్యూటీ.

టాలీవుడ్‌లో రవితేజకు జోడిగా నటించిన చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’. ఈ చిత్రంలో దక్షిణాదిలో పాగా వేసేందుకు సిద్ధమైయిపోయింది ఇలియానా. కానీ అది కాస్తా.. ఫ్లాప్‌ను మూటగొట్టుకుంది. దీంతో ఎలాగైనా అవకాశాలు చేజిక్కించుకోవాలని ఈ భామా హాట్‌ హాట్‌ గ్లామరస్‌ ఫొటోస్‌ను ట్విట్టర్‌, ఇన్‌స్ట్రాగ్రామ్స్‌లలో పెట్టింది. శరీరంపై కనిపించీ కనిపించని దుస్తులు ధరించిన ఫొటోలను పోస్ట్‌ చేసి సినీ వర్గాల దృష్టిని తన వైపునకు తిప్పుకునే పనిలో పడింది. అయితే.. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అవకాశాల కోసం మరి ఇంత దిగజారాల అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

leave a reply