సముద్రం ఒడ్డున.. ఛత్రపతి శివాజీ!

అరేబియా సముద్రం ఒడ్డున నిర్మితమవుతున్న ఛత్రపతి శివాజీ విగ్రహన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు మొదలు కాబోతున్నాయి. విగ్రహ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం రూ.3,643.78 కోట్ల బడ్జెట్‌ను ఇందుకు కేటాయించినట్లు పేర్కొంది. శివాజీ విగ్రహాన్ని రానున్న 2022-23 సంవత్సరంలోపు నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. విగ్రహ నిర్మాణం పనుల ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం ఒక బడ్జెట్‌ విడుదల చేసింది.

మొత్తం బడ్జెట్‌లో విగ్రహ నిర్మాణానికి సరిపడా ఖర్చు 2,581 కోట్లు వెచ్చించారు. 2016 లో ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజ చేసారు. జీఎస్టీ, భద్రతకు అవసరమైన మౌలిక సదుపాయాల స్థాపన కోసం రూ.309.72 కోట్లు, నీటి వనరులు, విద్యుత్‌ సరఫరా కోసం మరో రూ.45 కోట్లు కేటాయించామన్నారు. భవిష్యత్‌ అవసరాల కోసం రూ.112 కోట్లు, విగ్రహ పరిసరాల్లో కంప్యూటరీకరణ కోసం రూ.56కోట్లు, ఇతరత్రాల కోసం రూ. 140 కోట్లు కేటాయించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

leave a reply