ఆరోగ్యంతో పాటు రుచి కూడా

పొద్దున్నే ఓ కాఫీ లేదా టీ చుక్క పడనిదే బెడ్‌ దిగరు కొందరు. తలనొప్పిగా ఉన్నా, కాస్త అయోమయంగా ఉన్నా టీ తాగే అలవాటు ఉంటుంది కొందరికి. టీ తాగకపోతే ఏ పనీ చేయలేరు కొందరు. అలాగని మితిమీరి తాగడం మంచిది కాదు. అలాంటి వారికోసమే ఈ హెర్బల్‌ టీలు మార్కెట్లోకి వచ్చేసాయి. కాస్త రుచిగా చేసుకోని లాగించేస్తే సరి. హెల్త్‌ కు హెల్త్‌. తాగామనే ఆనందం. ఇలా రెండూ కోరికలు తీరిపోతాయి. మరి అవేంటో తెలుసుకుందామా..!

బ్లాక్‌ టీ..

బ్లాక్‌ టీ చేధుగా ఉంటుందని చాలా మంది దీనిని దూరం పెడతారు. కానీ బ్లాక్‌ టీ తాగడం వల్ల షుగర్‌ వ్యాధిని నియంత్రించవచ్చు. రక్తాన్ని శుభ్రంగా చేస్తుంది. ఎలాంటి వాపులనైనా తగ్గేలా చేస్తుంది.

మందార టీ..

మందార నూనె గురించి విన్నారు కాని.. మందార టీ గురించి విని ఉండరు. ఈ మందార టీ తాగడం వల్ల షుగర్‌, కొలెస్ట్రాల్‌, బీపీ, మూత్ర పిండాల వ్యాధులకు చెక్‌ పొట్టొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్‌ సీ, పీచుపదార్థం, ఐరన్‌ పుష్కలంగా లభిస్తాయి. మందరా పువ్వును ఎండబెట్టి టీగా చేసుకుని తాగొచ్చు. మందార పువ్వును కొన్ని మందులలో కూడా ఉపయోగిస్తారు.

తులసీ టీ..

ఆరోగ్యాన్ని అందించే వాటిలో తులసి ఆకు ముందుంటుంది. చాలా మందులు, బ్యూటీ ప్రాడెక్ట్స్‌లో తులసిని ఎక్కువగా వాడుతూంటారు. తులసి వల్ల కొవ్వును అదుపులో పెట్టుకోవచ్చు. తులసి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జ్ఞాపక శక్తిని పెంపొందించడంలో తులసి పాత్ర చాలా ముఖ్యమైనది.

ఇలా.. దాల్చిన చెక్క, మిరియాలు, జీలకర్ర, లెమన్, గ్రీన్‌ టీలు చాలా ఔషద గుణాలతో పాటు మంచి రుచిని ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి.

leave a reply