ఫెడరర్‌పై సచిన్‌… ప్రశంసల వర్షం!

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పెను సంచలనంగా మరీనా స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌పై మరింత గౌరవం పెరిగిందని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. గత శనివారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో అక్రిడేషన్‌ పాస్‌ మర్చిపోయి  డ్రెస్సింగ్‌ రూంవైపు వెళ్తున్న రోజర్‌ ఫెడరర్‌ను వెళ్లనీయకుండా అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకుంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆస్ట్రేలియా ఓపెన్‌ తన అధికారిక ట్విటర్‌లో ‘ఫెడరర్‌కు కూడా అక్రిడేషన్‌ కావాల్సిందే’ అనే ట్యాగ్ తో పోస్ట్ చేసింది. అయితే ఆ సమయంలో రోజర్‌ ఫెడరర్‌ కూడా మాములుగా స్పందించాడు. ఈ వీడియోను రీట్వీట్‌ చేస్తూ సచిన్‌…ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెక్యూరిటీ ఆఫీసర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించడం అభినందనీయమని… అదే సమయంలో ఫెడరర్ స్పందించిన తీరు కూడా అద్భుతమని, ఇలాంటి వాటితో ఫెడరర్ వంటి గొప్ప అథ్లెట్‌పై మరింత గౌరవం పెరుగుతుంది’ అని అయన ట్వీట్ చేశాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. అందరితో పాటే రోజర్ ఫెడరర్ అక్కడే నిలబడగా, కాసేపటికి ఆయన కోచ్ ఇవాన్ జుబిసిస్ వెంటనే అక్కడికి వచ్చి ఆయన ఐడీ కార్డ్ చూపించిన తర్వాత గానీ ఫెడరర్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ సిబ్బంది లోపలికి అనుమతిచలేదు. ఐడీ కార్డులు లేకపోవడంతో ఆటగాళ్లను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మరియా షరపోవాను కూడా ఐడీ కార్డు కోసం కారిడార్లో వేచిఉండాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో హ్యాట్రిక్‌తో కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాలనుకున్న ఫెదరర్‌ ఆశఫై నీళ్లు చల్లినట్లైంది. ఈ స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో యువ ఆటగాడి చేతిలో పరాజయం పాలయ్యాడు. నాలుగు సెట్లపాటు ఆసక్తికరంగా జరిగిన పోరులో 20 ఏళ్ల సిట్సిపాస్‌ 6-7 (11-13), 7-6 (7-3), 7-5, 7-6 (7-5)తో తనకన్నా 17 ఏళ్ల పెద్దవాడైన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫెదరర్‌ను ఓడించాడు. వరుసగా మూడోసారి… రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఈ స్విస్‌ స్టార్‌కు… కెరీర్‌లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్‌ ఆడుతోన్న సిట్సిపాస్‌ ఊహించని షాక్‌ ఇచ్చాడు. మూడో సీడ్‌ ఫెడరర్‌పై గెలిచి కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

leave a reply