సినిమాల్లోకి సూర్య సన్‌..

యాక్షన్‌, రొమాంటిక్‌ హీరో సూర్య సన్ దేవ్‌ సినిమాల్లోకి వస్తున్నట్లు కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎనిమిదేళ్లు ఉన్న దేవ్‌ సినిమాలో నటింబోతున్నాడా..? అంటే.. ఆ గుసగుసలు నిజమనే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. హీరో సూర్య కుమారుడు దేవ్‌ నటించే సినిమాను ఓ కొత్త డైరెక్టర్‌ తీస్తున్నట్లు సమాచారం. ఇటీవల.. ఈ సినిమాకోసం చైల్డ్ ఆర్టిస్టులకు ఆడిషన్‌ కూడా నిర్వహించారు.

అయితే.. సూర్య సొంత బ్యానర్‌ అయిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఎనిమిదేళ్ల అబ్బాయికి ఓ కుక్కపిల్లకి మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందనే కథలోనే ఈ సినిమా నిర్మించబోతున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

leave a reply