ఇక్కడే చేయలనుకున్నాం..

కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో ‘యన్.టి.ఆర్’ చిత్ర యూనిట్ సందడి చేసింది. బాలక్రిష్ణతో పాటు ‘యన్‌.టి.ఆర్‌’ చిత్ర దర్శకుడు క్రిష్‌, నటి విద్యాబాలన్‌, నటుడు కల్యాణ్‌రామ్‌ తదితరులు ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నిమ్మకూరు చేరుకున్నారు. వీరికి బంధువులు, నిమ్మకూరు వాసులు ఘన స్వాగతం పలికారు. నిమ్మకూరుకు చేరుకోగానే నటుడు బాలకృష్ణ తన తల్లిదండ్రులకు పూలమాల వేసి, నివాళులర్పించారు. అలాగే.. బసవతారకం పాత్రలో నటించిన నటి విద్యాబాలన్‌, కల్యాణ్‌ రామ్‌ కూడా ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లడారు. నిజంగా ఇది నాన్నగారి సంకల్పమే. ఎలాంటి ఇబ్బందులు లేకుండా `కథానాయకుడు’ను పూర్తి చేయగలిగాం. `మహానాయకుడు’ చిత్రీకరణ కూడా అయిపోయివచ్చింది. `యన్‌టీఆర్‌’ ఆడియో ఫంక్షన్‌ నిమ్మకూరులోనే ప్లాన్‌ చేశామని కాని అప్పుడు ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో హైదరాబాద్‌లోనే చేశామన్నారు. అయితే ఇక్కడ పెద్దలు, బంధువులు, `అమ్మానాన్న’ల ఆశీర్వాదాలు తీసుకుందామని వచ్చమాని తెలిపారు. సినిమాను విజయవంతం చేయాలని కోరారు.

leave a reply