కంగనాకు అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం మద్దతు

బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌కు అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ మద్దతు ప్రకటించారు. ఆమె విజయానికి సరైన నిర్వచనం చెప్పారంటూ ట్వీట్‌ చేశారు. ఇటీవలె.. ‘మణికర్ణిక’ సినిమా వివాదంలో తనకు ఎవరూ మద్దతుగా నిలవలేదని అన్నారు. ఈ విషయంలో నటి ఆలియా భట్‌పై కూడా మండిపడ్డారు. అందరి సినిమాలకి ప్రమోషన్స్‌ చేసినా ‘నా సినిమాకు మాత్రం స్క్రీనింగ్‌కు ఆహ్వానించినా రాకపోవడంపై బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ ఫైర్‌’ అయిన విషయం తెలిసిందే.

కాగా.. కంగనా ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోను పెమా ఖండు రీట్వీట్ చేశారు. ‘విజయవంతం రాణించడం అంటే ఏంటో మిస్‌ కంగనా రనౌత్‌ జీ సరిగ్గా చెప్పారు. సామాజిక బాధ్యతల్ని తీసుకుని, ఓ నాయకుడిలా వ్యవహరించడమే విజయం’ అని అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం ట్వీట్‌ చేశారు.

leave a reply