ఏపీ శకటానికి బ్రేక్‌..

ఏటా భారతదేశంలో గణతంతత్ర దినోత్సవాలు చాలా వైభంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరుగుతాయి. ఆ వేడుకల్లో పాలు పంచుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. అలాంటి వేడుకల్లో దేశాన్ని గర్వపరిచేవిధంగా డాన్స్‌లు, స్కిట్స్‌, శకటాలు, ప్రదర్శనలు జరుగుతూంటాయి. అందులో ముఖ్యమైనది ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో విధమైన శకటాల ప్రదర్శనలు. అయితే ఈ సారి శకటాల ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేయలేదు. దీంతో ఏపీ భవన్‌ అధికారులు, సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌ శకటం ఎంపిక కాలేదు. ఆరోజు శకటాలను ప్రదర్శించాలనుకొనే రాష్ట్రాలకు కేంద్ర రక్షణశాఖ గత ఆగష్టులో ఆహ్వానాలు పింపిన విషయం తెలిసిందే.. గాంధీ జీవితంతో సంబంధం ఉన్న ఇతివృత్తాలను డ్రాయింగ్‌ రూపంలో గాంధీ కొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఇతివృత్తంతో డ్రాయింగ్స్‌ చేసి పంపించింది. కాగా.. అవి ఎంపిక కాకపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుందంటూ సీఎం చంద్రబాబు, ఏపీ భవన్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆఖరికి శకటాలను కూడా వదల్లేదని మోడీపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గాంధీ చరిత్రకు ఆంధ్రప్రదేశ్‌ ఒక ప్రస్థానమంటూ సీఎం అన్నారు. ఇక్కడే విజయవాడలో గాంధీ కొండపై గాంధీ పీస్‌ ఫౌండేషన్ నిర్మించిన 52 అడుగుల స్థూపం ఉందని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ ఉద్యమానికి ప్రజల గుర్తింపుగా దాన్ని నిర్మించారని.. తిలక్‌ పీస్‌ ఫౌండేషన్‌కు కోటి రూపాయలు సమీకరించే లక్ష్యంతో 22 లక్షల చరఖాలు కోనుగోలు చేయాలని గాంధీ గారు సూచించారని తెలిపారు. రిపబ్లిక్ డేకు ఏపీ శకటం లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కాగా.. ఎన్నో రాష్ట్రాలు సమర్పించిన నమూనాల కంటే ఆంధ్రప్రదేశ్‌ నమూనా చాలా అద్భుతంగా వచ్చిందని ఎందుకు ఎంపిక కాలేదో అర్థం కాలేదని ఏపీ భవన్‌ అధికారులు విచారం వ్యక్తం చేశారు.

leave a reply