ఇక నుంచి విమానాల్లో.. కూడా..

విమానాల్లో సెల్‌ఫోన్‌ వాడకం నిషేదం.. ఈ విషయం మనందరికీ తెలుసు.. అలాగే చాలా సినిమాల్లో కూడా మనం చూశాం..

కాగా.. విమానాల్లో రెండు గంటల పాటు సెల్‌ఫోన్‌ వాడుకోవచ్చని.. అయితే దానికి కొంత అమౌంట్‌ చెల్లించాల్సి ఉంటుందని బ్రాడ్‌కాస్టింగ్‌ టెక్నాలజీ సంస్థ హ్యూస్‌ ఇండియా ఛీప్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ కె.కృష్ణ తెలిపారు. అయితే ఈ అమౌంట్‌ రూ.700 నుంచి రూ.1000 వరకూ ఉంటుంది.

కాగా.. ప్రపంచంలో ఇదే సదుపాయం అందుబాటులో ఉన్న ఇతర దేశాలతో పోలిస్తే, శాటిలైట్‌ బ్యాండ్‌విడ్త్‌ ఛార్జీలు మనదగ్గర 7-8 రెట్లు అధికం కావడమే ఇందుకు సాథ్యపడిందని వివరించారు. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) నుంచి మాత్రమే బ్యాండ్‌విడ్త్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించడమే ఈ పరిస్థితికి కారణమని తెలిపారు. అందుబాటు ధరల్లో ఉంటేనే, ఈ సేవలను విమాన ప్రయాణికులు వినియోగించుకుంటారని, శాటిలైట్‌ బ్యాండ్‌విడ్త్‌ను ఎవరి దగ్గరైనా తీసుకునేందుకు అనుమతిస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. దేశీయ పరిధిలో విమానాలు, నౌకల్లో మొబైల్‌ సేవలు అందించే లైసెన్స్‌ కోసం హ్యూస్‌ కూడా దరఖాస్తు చేసింది. అంతర్జాతీయంగా చూస్తే, విమానాల్లో మొబైల్‌ ఫోన్లను 10 శాతం మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు.

leave a reply