పూర్తి ఫిట్‌నెస్‌తో..జడేజా!

పెర్త్ లో జరిగిన రెండో టెస్టుకు ముందు భారత జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే జట్టులో ప్రకటించిన 13 మంది జాబితాలో రవీంద్ర జడేజా పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. కానీ అప్పుడు నిజానికి అతడు అప్పుడు పూర్తి శాతం ఫిట్ తో లేడు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులోకి రావడానికి ముందే తను భుజం నొప్పితో బాధపడుతున్నాడు. అలాగే తుది జట్టులో జడేజా లేకపోయినా సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌ కూడా చేయించారు. పెర్త్‌ టెస్టు కోసం జట్టు సభ్యుల ఎంపిక సరిగా లేదని, ఓటమికి కూడా కారణమనే తీవ్ర విమర్శల నేపథ్యంలో కోచ్‌ రవిశాస్త్రి అసలు విషయం బయటపెట్టాడు. ఈ మ్యాచ్‌ కోసం నలుగురు పేసర్లతో భారత్‌ బరిలోకి దిగింది. అటు ఆసీస్‌ మాత్రం బౌన్సీ పిచ్‌ అయినా తమ స్పిన్నర్‌ లియాన్‌ను ఆడించింది. చివరకు తనే మ్యాచ్‌ విన్నర్‌గా మిగిలాడు. దీంతో రవిశాస్త్రి మాజీలపై విమర్శలు ఎక్కుపెడుతూనే జడేజా ఫిట్‌నె్‌సపై అసలు విషయం వెల్లడించాడు.


తాజాగా జడేజా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ స్పందించింది. పూర్తి ఫిట్‌గా ఉన్నాడనే అతడిని ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేశామంది. అయితే ఆసీస్ లోనే అతడి ఎడమ భుజం నొప్పి మరల తిరగబెట్టిందని స్పష్టం చేసింది. అయితే.. ప్రస్తుతం జడేజా భుజం నొప్పి నుంచి కోలుకున్నాడు. అతడు మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని సమాచారం . విండీస్‌తో జరిగిన వన్డే సిరీ్‌సలో అతడు బౌలింగ్‌ ఎక్కువగా చేయడం వల్ల నొప్పి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. గతనెల 2న ఇంజెక్షన్‌ తీసుకోవడంతో ఉపశమనం లభించింది. ఫిట్‌గా కనిపించడంతోనే ఆసీస్‌ టూర్‌కు ఎంపికయ్యాడు. అయితే సీఏ లెవన్‌తో వామప్‌ మ్యాచ్‌లో తిరిగి నొప్పి వచ్చింది. దీంతో మరో ఇంజెక్షన్‌ తీసుకున్నాడు. రెండో టెస్టుకు ముందు నెట్స్‌లో అతడి బౌలింగ్‌ చూస్తే ఫిట్‌గా లేడనిపించి ఆడించలేదు’ అని బోర్డు వివరించింది.అయితే జడేజా మూడో టెస్టుకు ఫిట్ గా ఉన్నాడని బీసీసీఐ వివరించింది.

leave a reply