ఇప్పుడన్నా.. పట్టించుకుంటారా..?

ఢిల్లీలో పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. క్రితం పార్లమెంట్‌ సమావేశాల్లో ఏపీ ఎంపీలు చేసిన నిరసన అంతా ఇంతా కాదు.. దేశవ్యాప్తంగా ఇదే హాట్‌ టాపిక్‌ అయ్యింది. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న నేతలందరూ సీఎం చంద్రబాబుకు మద్దతు తెలపడం కూడా జరిగింది. ఏపీకి ప్రత్యేక హామీలు ఇస్తామని నాలుగేళ్లుగా బీజేపీ ఏపీ ప్రజలను మభ్యపెట్టింది. ఇస్తామన్న హామీలు.. ఇవ్వకపోగా.. నిధులు కూడా సమీకరించకపోవడంతో బీజేపీ నుంచి బయటకు వచ్చిన టీడీపీ పార్లమెంట్‌లో తన గళాన్ని తీవ్రంగావినిపించింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో కూడా పార్లమెంట్‌ ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. చట్టంలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపట్టారు.ఎంపీలు అశోక్‌ గజపతి రాజు, టీజీ వెంకటేశ్‌, మురళీ మోహన్‌, శివప్రసాద్‌, కనకమేడల రవీంద్ర కుమార్‌, కొనకళ్ల నారాయణ, గల్లా జయదేవ్‌ ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

leave a reply