బలోపేతంకై.. చైనా!

పాకిస్థాన్ ను బలోపేతం చేసేందుకు చైనా మరో ముందడుగు వేస్తోంది. హిందూ మహాసముద్రంలో పాకిస్థాన్‌ను బాలపరిచేందుకు చైనా తన సహకారాన్ని మల్లి అందిస్తోంది. చైనా ఎల్లప్పుడూ అనుకూల మిత్రుడిగా పాకిస్థాన్‌ను పరిగణిస్తోంది. చైనా మీడియా కధనాల ప్రకారం పాకిస్థాన్ నావికా దళానికి అత్యాధినిక యుద్ధ నౌకలను నాలుగింటిని ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.  అయితే ఈ నాలుగింటిలో ఓ నౌకను చైనా స్వయంగా తయారు చేస్తోంది. దీనిలో అత్యాధునిక ఆయుధాల వ్యవస్థలు ఏర్పాటు చేయడంతో పాటు, నిఘా సమాచార సేకరణకు అనుగుణంగా తగిన ఏర్పాట్లను తయారుచేసే విధంగా ఒప్పందం జరిగినట్లుగా చైనా స్టేట్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ పేర్కొన్నట్లు  తెలిపింది. చాలా కాలం నుంచి  పాకిస్థాన్‌కు చైనా భారీగా ఆయుధాలను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే.

leave a reply