ఎవరికి నష్టం.. ఎవరికి లాభం..!

2018 తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. కాగా గురువారం రాజ్‌భవన్‌ ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. అయితే తెలంగాణలో కేసీఆర్‌ విజయం సాధించిన తరువాత.. అందరి చూపూ ఏపీ సీఎం చంద్రబాబుపైనే.. అసలు చంద్రబాబు కాంగ్రెస్‌లో కలవడమే అందరూ షాక్‌ అయిన విషయం.. ఇప్పుడు అసలు విషయమేంటంటే చంద్రబాబు కాంగ్రెస్‌లో కలిసి మహాకూటమిగా తెలంగాణ ఎన్నికల్లోకి వెళ్లడం బాబుకే నష్టమని టీడీపీ నాయకులు అంటుంటే..మరికొందరు లాభమేనని అంటున్నారు. ఇంతకీ చంద్రబాబు – కాంగ్రెస్‌లో కలవడం వల్ల కాంగ్రెస్‌కి నష్టమేనని కాంగ్రెస్‌ నేతల వాదన.. మరి అసలు ఎవరు నష్టపోయారో చూడాలంటే క్రిందిటి సంవత్సరం జరిగిన ఎన్నికలు పరిశీలించాల్సిందే..

2014లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు పతాక స్థాయిలో ఉన్న సమయంలో కూడా తెలంగాణలో టీడీపీ 15 సీట్లు గెలిచింది. 14.7 శాతం ఓట్లు సాధించింది. కానీ 2018 ఎన్నికల్లో టీడీపీ ఓట్ షేర్ 3.5 శాతానికి పడిపోయింది. సాధించిన సీట్లు కూడా కేవలం రెండే.

కాంగ్రెస్ తో పొత్తు కారణంగా టీడీపీ కేవలం 13 సీట్లకే పోటీ చేసింది. పొత్తు కారణంగా టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు మళ్లింది. కానీ… టీడీపీకి కాంగ్రెస్ ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్ 2014 కంటే 4.2 శాతం పెరగడమే దీనికి ఉదాహరణ. 

కాబట్టి.. తెలంగాణఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టి నష్టపోయింది తామేనని టీడీపీ నేతలు అంటున్నారు. మరి.. ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందో అందరినీఆలోచింపజేస్తున్న ప్రశ్న..!

leave a reply