ఇరు జట్లు…నల్ల బ్యాడ్జీలతో

ఆస్ట్రిలియా తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీంఇండియా, ఆసీస్ జట్లు నల్ల బాడ్జీలతో మైదానంలోకి దిగారు. ప్రముఖ క్రికెట్‌ కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ మృతికి సంతాపంగా టీమిండియా ఆటగాళ్లు నివాళులు అర్పించారు. అయితే అచ్రేకర్‌ అనారోగ్య కారణంతో బుధవారం సాయంత్రం ముంబయిలో తుది శ్వాస విడవగా ఆయనకు నివాళులు అర్పించారు. అచ్రేకర్‌ కు 2010 లో పద్మశ్రీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. అయితే అయన వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ   కన్నుమూశారు. దీంతో ఆయన మృతికి సంతాపంగా టీమిండియా ఆటగాళ్లు తమ చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.

సచిన్‌ తెందుల్కర్‌, వినోద్‌ కాంబ్లీ వంటి క్రికెట్ దిగ్గజాలను ఓనమాలు నేర్పిన  అచ్రేకర్‌ కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఘనంగా వీడ్కోలు పలికాడు. ఈ రోజు ముంబైలో అయన అంత్యక్రియలు జరిపారు. అచ్రేకర్‌ మృతికి సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు నివాళులు అర్పిస్తున్నారు. అటు ఆసీస్‌ ఆటగాళ్లు సైతం మోచేతులకు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు. ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బిల్‌ వాట్సన్‌ మృతికి సంతాపంగా పైన్‌ సేన నల్లబ్యాండ్లు కట్టుకుని మైదానంలోకి దిగింది.

leave a reply