ఇస్మార్ట్‌ శంకర్‌గా

పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగంతి తెలిసిందే. అయితే.. ఈ సినిమాకి విచిత్రమైన టైటిల్‌ పెట్టారు. కాగా.. ఈ సినిమాకి సహ నిర్మతగా వ్యవహరిస్తున్న నటి ఛార్మీ ట్విట్టర్‌ ద్వారా సినిమా మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ‘ఈ హై వోల్టేజ్‌ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు మోషన్‌ పోస్టర్‌ నచ్చిందనే అనుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో తెలిపారు.

ఈ టైటిల్‌ బట్టి.. మోషన్‌ పోస్టర్‌ బట్టి ఈ సినిమాలో రామ్‌ బ్యాడ్‌బ్యాయ్‌గా కనిపిస్తున్నాడని అర్థమవుతుంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను కూడా చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. స్టైలిష్‌గా కనిపిస్తూ దమ్ము కొడుతున్నట్లుగా ఉన్న రామ్‌ లుక్‌ను రివర్స్‌గా చూపించారు. పోస్టర్‌పై డబుల్‌ సిమ్‌ కార్డ్‌ అని రాసుంది. ఇప్పటివరకు రామ్‌ నటించిన సినిమాల నుంచి ఇంత ఆసక్తికరమైన పోస్టర్‌ ఎప్పుడూ రాలేదనే చెప్పాలి. కాగా.. ఈ నెల నుంచే సినిమా చిత్రీకరణ మొదలుకానుంది. కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

leave a reply