అత్యధిక వైడ్లతో వరల్డ్ రికార్డ్!

ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన మూడో టెస్టులో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఆ టెస్టు మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు కలిపి మొత్తం 38 వైడ్లు వేసి చెత్త రికార్డు నెలకొల్పారు. దాంతో దశాబ్దం క్రితం వెస్టిండీస్‌-ఆస్ట్రేలియా నమోదు చేసిన అత్యధిక వైడ్ల చెత్త రికార్డును అధికమించారు. 2008 బ్రిడ్జిటౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో విండిస్-ఆస్ట్రేలియన్ బౌలర్లు కలిపి మొత్తం 34 వైడ్లు విసిరారు. అయితే వైడ్ల రూపంలో ఎక్కువ ఎక్స్‌ట్రా పరుగులిచ్చిన రెండు టెస్టుల్లోనూ వెస్టిండీస్ బౌలర్లు భాగంగా ఉండటం విశేషం.

మూడో టెస్టులో భాగంగా నాల్గో రోజు ఆటలో వెస్టిండీస్‌ బౌలర్‌  కీమర్‌ రోచ్‌ వేసిన ఐదో బంతిని వైడ్‌గా వేశాడు. అది రోచ్‌కు ఇన్నింగ్స్‌లో రెండో వైడ్‌. దాంతో గత వైడ్ల రికార్డు సమం అయ్యింది. ఆపై వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన క్రమంలో ఇంగ్లండ్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ 14 ఓవర్‌లో వైడ్‌ వేశాడు. ఫలితంగా 35 వైడ్లతో చెత్త రికార్డును ఇరు జట్లు మూటగట్టుకున్నాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌ మరో మూడు వైడ్లు వేయడంతో మొత్తంగా 38 వైడ్లు పడ్డాయి. ఇక‍్కడ రెండు ఇన‍్నింగ్స్‌ల్లో కలిసి వెస్టిండీస్‌ తరపున 24 వైడ్లు రాగా, ఇంగ్లండ్‌ తరపు నుంచి 14 వైడ్‌ బాల్స్‌ వచ్చాయి. ఇక అత్యధిక వైడ్లు వేసిన జాబితాలో మూడో స్థానంలో  33 వైడ్లతో దక్షిణాఫ్రికా-భారత్‌ జట్లు నిలిచాయి.

leave a reply