ఇవి తింటే బరువు పెరగరు!

సాధారణంగా మనం తినే ఆహారంలో ఏవి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతామో ఏవి తీసుకోకపోతే బరువు పెరగమో పెద్దగా తెలియక పోవచ్చు. కానీ బరువు తగ్గించే ఆహార పదార్ధాలలో కొన్ని రకాల ఆహారాల వల్ల బరువు పెరగరని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్డు తింటే బరువు తగ్గుతారట! దీనిలోని ల్యూసిన్‌ అనే అమైనో యాసిడ్‌ బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే దానిమ్మ గింజలు ఎన్ని తిన్నా కడుపు నిండిన ఫీలింగ్‌ కలగడంతో ఆహారం తీసుకోవలన్న కోరిక రాదట.

కొన్ని ఆహార పదార్ధాల తయారీకి ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగిస్తే మంచిదని, ఈ నూనెలోని మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొల్రెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను కాపాడతాయని దీని వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉండదని తెలిపారు. ఇక చేపల్లో కూడా కొవ్వు ఉండదు కాబట్టి వాటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇతర మాంసాల జోలికి పోకుండా కేవలం చేపలను మాత్రమే తీసుకోవడం వలన బరువు తగ్గవచ్చని తెలిపారు. అంతేకాక పచ్చని కాయగూరలు, ఆకుకూరల్లో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుందట. కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయలను ఎక్కువగా తింటే బరువు పెరగరు. పైగా వెజిటబుల్ సూప్స్ వల్ల కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. దీంతో బరువు పెరిగే ఆస్కారం ఉండదు.

leave a reply