చుండ్రు సమస్య పోవాలంటే!

ప్రస్తుతం పెరిగిపోతున్న కాలుష్యానికి ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే చాలు వెంట్రుకలు రాలిపోవడమో లేక చుండ్రు భారిన పడటమో జరుగుతుంది. ఒకవైపు పెరుగుతున్న కాలుష్యం, మరోవైపు ఎండ వల్ల జుట్టు పొడిబారి పెలుసుగా తయారవ్వడమేగాక, చుండ్రు బాధ తప్పడం లేదు. అయితే దీని కోసం సరైన పోషణతో, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి!

 జుట్టు ఊడిపోకుండా తరచూ వేధించే చుండ్రు భారి నుంచి తప్పించుకోవాలంటే… రెండు టేబుల్‌స్పూన్ల బ్రౌన్‌ షుగర్‌కు ఒక టేబుల్‌స్పూన్‌ హెయిర్‌ కండిషనర్‌ కలిపి తలకు పట్టించాలి. కొద్దిసేపటి తరవాత నీళ్లతో శుభ్రంగా స్నానం చేస్తే చుండ్రు సమస్య పోతుంది. వేడిమి వల్ల వెంట్రుకలు రాలిపోతాయి. జుట్టుకు తేనె, ఆలివ్‌ ఆయిల్‌ మిశ్రమం వాడడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అరకప్పు తేనెలో రెండు టేబుల్‌స్పూన్ల ఆలివ్‌ ఆయిల్‌ కలిపి వెంట్రుకలకు బాగా పట్టించి ఇరవై నిమిషాల తర్వాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఆలివ్‌ ఆయిల్‌ వెంట్రుకలకు కండిషనర్‌గా పనిచేస్తే, తేనెలో కండిషనర్‌ గుణాలతోపాటు యాంటీ బాక్టీరియల్‌ గుణాలున్నాయి. దీంతో జుట్టు సాఫ్ట్ గా సిల్కీగా తయారవుతుంది.

leave a reply