పరాజయంఫై… చరణ్ వివరణ!

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ చిత్రం గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ ఒక లేఖను చేసారు. ప్రేక్షకుల, అభిమానుల ప్రేమ, ఆదరణను ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మంచి సినిమాలు చేస్తానని రామ్‌చరణ్ అన్నారు. ఆయన చిత్రాన్ని ఉద్దేశిస్తూ మంగళవారం‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రియమైన అభిమానులు, ప్రేక్షకులకు.. నా పట్ల, మా సినిమా పట్ల మీరు చూపించిన ప్రేమ, అభిమానాలకు వినయపూర్వక ధన్యవాదాలు. మా ‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులు అందరికీ నా ధన్యవాదాలు. నిర్మాత దానయ్య అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది.

మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు, ప్రదర్శనదారులకు ధన్యవాదములు. మీ అందరికీ నచ్చి, వినోదం పంచే సినిమా అందించటానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఈ చిత్రాన్ని అందించలేకపోయామన్నారు. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.

అన్ని వేళలా మద్దతు అందించిన మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు ఎల్లప్పుడూ చూపించే ఈ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. ప్రేమతో.. మీ రామ్‌చరణ్‌’ అంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఈ చిత్రానికి  బోయపాటి  దర్శకత్వం వహించగా, కియారా అడ్వాణీ ఇందులో కథానాయికగా నటించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

leave a reply