గ్రంధాలయంతో ఎవరికీ…లాభం!

Washington : President Donald Trump and Indian Prime Minister Narendra Modi hug while making statements in the Rose Garden of the White House in Washington, Monday, June 26, 2017. AP/PTI(AP6_27_2017_000042B)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారు. ట్రంప్‌ తన కేబినెట్‌ సమావేశంలో మాట్లాడుతూ…అఫ్గానిస్థాన్‌ లో నెలకొన్న కొన్ని పరిస్థితులను ప్రస్తావించారు. అఫ్గానిస్థాన్‌ను పునర్‌ నిర్మించేందుకు భారత్‌ ముందుకు రావట్లేదని , ఎటువంటి నిర్మాణ చర్యలు అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు. కొన్ని రోజుల క్రితం మోదీతో సమావేశమైన సమయంలోమోదీ కోన్నీ వ్యాఖ్యలు చేసారని అఫ్గాన్‌లో లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారని వివరించారు. దానికి మేం కృతజ్ఞతలు తెలిపాం.అయితే భారత్‌ ఏర్పాటు చేయబోయే గ్రంథాలయంతో కలిగే ప్రయోజనమేంటని దాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారో కూడా తెలియదు అని ట్రంప్‌ పేర్కొన్నారు.

అయితే అఫ్గాన్‌లోని తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడేందుకు భారత్‌ సహా రష్యా, పాకిస్థాన్‌ వంటి దేశాలు తమ సహకారం అందించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. తాలిబన్లతో శాంతి చర్చలు జరిపేందుకు ఇతర దేశాలు ప్రయత్నించాలని ట్రంప్‌ కోరారు. అఫ్గాన్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటూ భారత్‌, అఫ్గాన్‌ మధ్య ఒప్పందం జరిగింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఇరిగేషన్‌, తాగునీరు ఇలా కొన్ని రంగాలకు అభివృద్ధికి సాయం చేస్తామని భారత్‌ తన ఒప్పందంలో పేర్కొన్నట్లు వివరించారు. దీనిలో భాగంగానే భారత్ అఫంగనిస్తాన్ లో గ్రంథాలయ ఏర్పాటు చేసింది.

leave a reply