ఈ సారైనా గిల్‌కు… చోటు దక్కేనా!

హార్దిక్ పాండ్య, కె ఎల్ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన సందర్భంలో, న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా తొలిసారిగా భారత జట్టులోకి వచ్చిన యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌ను  ఆడించాలని టీమిండియా మాజి కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఈ 19 ఏళ్ కుర్రాడికి న్యూజిలాండ్ తో జరిగిన తొలి మూడు వన్డేల్లో తుది జట్టులో కూర్పుకు అవకాశం దొరకలేదు. దీనితో బెంచ్కే పరిమితమవ్వాల్సి వచ్చింది. 

అయితే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంతో చివరి రెండు వన్డేలకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ స్థానంలో గిల్‌ను ఎంపిక చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుది జట్టులో గిల్‌కు అవకాశం ఇస్తే అతనికి ఉపయోగపడుతుందని, అందుకు అతడు అర్హుడని గంగూలీ పేర్కొన్నాడు. ఐతే గిల్‌ ఏ స్థానంలో ఆడితే బాగుంటుందో కూడా గంగూలీ వివరించాడు. ధోనీని నాలుగో స్థానంలో ఆడించాలని, ఐదో స్థానానికి జాదవ్ చక్కగా ఇమిడిపోతాడని అంతేకాకుండా అతడు ఒత్తిడిలో బ్యాటింగ్‌ చేయగల సమర్థుడని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

leave a reply