ధోనినే నాకు స్ఫూర్తి:విజయ్ శంకర్!

ప్రపంచకప్‌కు సర్వం సిద్దమవుతుంది. భారత జట్టు కూడా దాదాపు జట్టు కూర్పును సిద్ధం చేస్తుంది. టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకొని  ప్రపంచకప్‌లో తాను ఆడగలనని నిరూపించుకున్నాడు. అయితే ఛేజింగ్‌ చేసే తత్వాన్ని టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ ధోనిని చూసే నేర్చుకున్నానని వివరించాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా సిరీస్‌ల్లో చక్కటి ఆటతో అలరించాడు. ఈ యువ ఆల్‌రౌండర్‌ తన ప్రదర్శన గురించి మీడియాతో పంచుకున్నాడు. సీనియర్‌ క్రికెటర్లు ధోని, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలతో డ్రెస్సింగ్‌ రూంలో కలిసి ఉండటం నమ్మలేకపోతున్నానన్నాడు.

సీనియర్లతో కలిసి ఆడటం ఒక గొప్ప వరంగా బావిస్తున్నానని, వారి ఆటను గమనిస్తూ చాలా నేర్చుకుంటున్నా. ముఖ్యంగా ఛేజింగ్‌ విషయంలో ధోనిని చూసి నేర్చుకున్నానన్నాడు. కఠిన పరిస్థితుల్లో ఎలా ఆడాలో, అతని మైండ్‌సెట్‌ను చూసే అలవర్చుకున్నాను. న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగమని టీమిండియా మేనేజ్‌మెంట్‌ అడగడం నిజంగా నాకు పెద్ద సర్‌ప్రైజ్ అని తెలిపాడు. సిరీస్‌ ముందే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్దంగా ఉండాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌ చెప్పడంతో పరిస్థితికి అనుగుణంగా బ్యాటింగ్‌ చేయడంపై దృష్టి సారించానన్నాడు. అయితే చివరి టీ20 పరాజయం నిరాశను మిగిల్చిందన్నాడు.  నేను ఇంకా  వేగాన్ని, స్థిరత్వాన్ని అందిపుచ్చుకోవాలని తెలియచేసాడు.

వెల్లింగ్టన్‌ వన్డేలో రాయుడితో నెలకొల్పిన అద్భుత భాగస్వామ్యంపై స్పందిస్తూ… నేను క్రీజులోకి అడుగుపెట్టినప్పుడు 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి భాగస్వామ్యం అవసరం. కానీ ఆ సమయంలో కివీస్‌ బౌలర్లను ఎదుర్కోవడం కష్టంతో కూడుకున్నది. రాయుడు చక్కని ఫామ్ కనబరిచి మంచి స్కోరును నమోదు చేసాడు, నేనింకా పరుగులు చేయాల్సిందని పేర్కొన్నాడు.  ప్రస్తుతం ఉన్న పోటీలో విజయ్‌ శంకర్‌ పేస్‌ ఆల్‌ రౌండర్‌ స్థానానికి బలమైన పోటీదారుడిగా ప్రపంచకప్‌ రేసులోకి దూసుకొచ్చాడు.

leave a reply