కోహ్లీ వైపే…ఐసీసీ అవార్డ్స్!

ఐసీసీ అవార్డుల జాబితాలో కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ అవార్డులు కోహ్లీ కోసం క్యూ కట్టాయి. ఐసీసీ ప్రకటించిన సర్‌ గార్‌ఫీల్డ్‌‌ సోబెర్స్‌‌ ట్రోఫీ ఫర్‌ ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌, ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌, ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌.. ఈ మూడు అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 2018 సంవత్సరానికి గాను…13 టెస్టుల్లో 55కు పైగా సగటుతో 1,322 పరుగుల చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ ఎదురులేని కోహ్లి 14 వన్డేల్లో 133.55 సగటుతో 1202 పరుగులు చేయగా ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. అయితే మొదటి సారి టెస్టు క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం.

‘2018లో కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా విరాట్‌ చూపిన అద్భుత ప్రదర్శనకు గాను ఒకే ఏడాది మూడు ఐసీసీ ప్రధాన అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులే కాక ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కూడా ఎంపికై సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ అవార్డు అందుకున్నాడు. అంతేకాకుండా ఐసీసీ టెస్టు, వన్డే జట్లకు సారథిగా కూడా విరాట్ కోహ్లినే ఎంపికయ్యాడు.   

భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎమర్జింగ్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్‌కు ఎంపిక కాగా… ఆస్ట్రేలియన్ క్రికెటర్‌ ఆరోన్‌ ఫించ్ ఐసీసీ టీ20 ఫెర్ఫార్మెన్స్‌‌ ఆఫ్ ది ఇయర్‌ 2018, కేన్‌ విలియమ్సన్‌.. ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్‌, శ్రీలంక అంపైర్‌ ధర్మసేన.. డేవడ్ షెఫర్డ్ ట్రోఫీ, స్కాలాండ్‌కు చెందిన కాలమ్ మెక్‌లీయోడ్.. ఐసీసీ అసోసియేట్ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ 2018 అవార్డులకు ఎంపికయ్యారు. కష్టానికి ఫలితం దక్కింది. ఎంతో ఆనందంగా వుంది. అవార్డులను క్లీన్‌స్వీప్‌ చేసినందుకు గర్వంగా ఉంది’ అంటూ విరాట్‌ కోహ్లి ట్వీట్‌ ద్వారా తెలిపాడు.

leave a reply