ఉదయాన్నే నీళ్లెందుకు తాగాలి..?

ప్రపంచానికి మూలాధారం నీరు, గాలి. మనిషి జీవితంలో నీళ్ల పాత్ర చాలా ముఖ్యమైనది. ఆహారం తీసుకోకుండా ఉండగలడేమో కానీ నీళ్లు తాగకుండా ఉండలేము. ఉదయాన్నే నీళ్లు తాగి వాకింగ్‌ కానీ జాగింగ్‌ కానీ చేస్తే ఇక మీ ఆరోగ్యానికి తిరుగుండదు. ఉదయాన్నే బెడ్‌ కాఫీ, టీలు తాగేవారు ముందు కొంచెం వాటర్‌ తీసుకోవడం చాలా మంచిది. ఇది ఉదయాన్నే శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు తొలగిస్తుంది. ఒక మనిషి రోజుకు దగ్గర దగ్గరగా 8 గ్లాసుల వాటర్‌ తాగాలి.  

వాటర్‌ తాగడం వల్ల ఉపయోగాలు మరి కొన్ని తెలుసుకుందాం..

*ఉదయాన్నే వాటర్‌ తాగడం ద్వారా బ్లడ్‌ ఫ్యూరిఫై అవుతుంది.

*చర్మం పొడిబారకుండా సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది

*ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగితే మల విసర్జన సులభంగా జరుగుతుంది.

*పెద్ద పేగు శుభ్ర పడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది.

*పరిగడుపున నీళ్లు తాగటం వల్ల ఒంట్లో పేరుకుపోయిన వ్యర్ధాలు ఏ రోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి.

*జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేర పెరుగుతుంది.

*ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి.

*బరువు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

*మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్ల ముప్పు తక్కువ. వచ్చినా వెంటనే తగ్గుతాయి.

*కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం.

leave a reply