చిట్టి రాగులు.. గట్టి లాభాలు

రాగులను ‘ఫింగర్ మిల్లెట్ లేదా ఆఫ్రికన్ మిల్లెట్’ అని అంటారు. హెల్త్‌లో భాగంగా రాగులు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. వీటిని అంతర్‌ పంటగా సాగు చేస్తారు. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో వీటిని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఇవి చక్కగా పండుతాయి. అలాగే ఇవి ఎక్కువకాలం నిలువ కూడా ఉంటాయి. వీటికి చీడపీడల బాధ కూడా చాలా తక్కువ అని చెప్పొచ్చు.

ఆహారంలో భాగంగా రాగులు చాలా ప్రధానమైన పాత్ర పొషిస్తాయి. ఎముకలు గట్టిగా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి. రాగులను పిండిరూపంలో అంబలి లాగ చేసుకుని, దానిలో కొంచెం పెరుగు కలుపుకుని ఉదయం పూట తీసుకుంటే చాలా మంచిదని పెద్దల కాలం నుంచి చెప్తున్న మాటే. ఎక్కువగా రాయలసీమలో వీటిని ఆహారంలో ఎక్కువగా తింటారు. రాయలసీమ స్పెషల్‌ వంటకం ఏంటంటే.. రాగి సంగటి, కోడికూర లేదా పొట్టేలు మాంసం అని చెబుతూ ఉంటారు. రాగిని గరగగా పిండి చేసి దాని ఒక ముద్దలా చేసి దానిలో మాంసాన్ని జోడించి తీసుకోవడం రాయలసీమ స్పెషల్‌. అందుకే అక్కడి మనుషులు బలంగా ఉంటారు.

చాలామంది తల్లులు రాగులను లడ్డూలుగా కూడా చేసి సాయంత్రం పూట పిల్లలకు స్నాక్‌గా కూడా ఇస్తూంటారు. దీనిలో ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా చిన్నపిల్లలకు, వృద్ధులకు ఆహారంగా ఇస్తూంటారు. అలాగే చిన్నపిల్లలు వీటిని తీసుకుంటే వారిలో ఎదుగుదల బాగా కనిపిస్తుంది. అలాగే బలంగా కూడా తయారవుతారు. అలాగే వృద్ధాప్య ఛాయలు తొందరగా కనపడకుండా ఇవి సహాయం చేస్తాయి. అలాగే షుగర్‌ ఉన్నవారు క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటూ ఉంటే గ్లూకోజ్‌ స్థాయి సమంగా ఉంటుంది. షుగర్‌కు ఇదొక చిట్కాలాగా పనిచేస్తుంది. ఏ బీపీ ఉన్నవారైనా దీనిని తీసుకుంటే వారి బాడీని బాలెన్స్‌ చేస్తూ ఎప్పటికప్పుడు ఎనర్జీ అందిస్తుంది.

leave a reply