ఎన్నికల పోటీపై…ఉదయనిధి స్టాలిన్‌..

కరుణానిధి వారసుడు సాధ్యమైనంత వరకు రాజకీయాలపై  తన దృష్టి సారిస్తానని వివరించారు. ఇకపై సినిమా అవకాశాలను తగ్గించుకుని రాజకీయాలపై దృష్టి పెడతానని నటుడు ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. సినీరంగంలో తనకు మంచి గుర్తింపు లభించిందని చెప్పారు, అయితే ప్రారంభంలో కామెడీ సినిమాలు చేసిన తనకు మంచి క్రేజ్‌ లభించిందని, తరువాత  థ్రిల్లర్‌ సినిమాల్లో నటించేప్పుడే తనకు నటనపై గల  ఆసక్తి ఎక్కువైందన్నారు. ఇకమీదట కూడా తన తదుపరి సినిమాలలో కూడా మంచి కథలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సినిమాల్లో నటించబోతున్నానన్నారు.

ప్రస్తుతం తన తండ్రి స్టాలిన్‌కు రాజకీయాల్లో సహకరిస్తున్నానని, ఇకపై సినిమా అవకాశాలు కొంతమేరకు తగ్గించుకుని పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై వస్తున్న వార్తలన్నిటిని కొట్టిపారేశారు. అయితే పార్టీలో సభ్యుడిగా మాత్రమే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని ఉదయనిధి స్టాలిన్‌ చెప్పుకొచ్చారు.

leave a reply