అందుకే `క్షీరారాముడై’నాడు..

పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పంచరామక్షేత్రాల్లో ‘పాలకొల్లు’ ఒకటి. పశ్చిమ గోదావరిలో మహిమాన్వితమైనటువంటి ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. సాక్షాత్తు శ్రీమహా విష్ణువు ప్రతిష్ఠించిన సదా శివుడిని, క్షీర రామలింగేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తుంటారు. ఈ క్షేత్రనికి ‘పాలకొల్లు’ అనే పేరు రావడం వెనుక పురాణ సంబంధమైన కథనం ఒకటుందని చెబుతారు.

 పూర్వం ‘ఉపమన్యువు’ అనే బాల భక్తుడు పాల కోసం పరమశివుడిని ప్రార్ధిస్తాడు. అప్పుడు ప్రత్యేక్షమైన సదా శివుడు .. తన త్రిశూలాన్ని నేలపై గుచ్చుతాడు. అక్కడి నుంచి పాలు పైకెగసి పడతాయి. అందువలన ఈ క్షేత్రాన్ని ‘క్షీరపురి’గా పిలుచుకునేవారు. ఆ తరువాత ‘పాలకొలను’ గా .. ‘పాలకొల్లు’గా రూపాంతరం చెందింది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీరామచంద్రుడు.. పాలతో ఇక్కడి శివలింగానికి అభిషేకం చేశాడు. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారు  ‘క్షీర రామలింగేశ్వర స్వామి’గా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.     

leave a reply