కేటీఆర్‌తో కలిసి..ఎన్టీఆర్?

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అర‌వింద స‌మేత చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న జూనియర్ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్ర తొలిషెడ్యూల్ ఇటీవ‌లే పూర్తి కాగా, జ‌న‌వ‌రిలో రెండోషెడ్యూల్ మొద‌లు పెట్ట‌నున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంటున్నఎన్టీఆర్ రీసెంట్‌గా ఓ ప్రైవేట్ పార్టీకి వెళ్ళారు. అక్క‌డ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఫోటో దిగారు. వీరిద్ద‌రు క‌లిసి దిగిన ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. కేటీఆర్ సినిమా ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప్ర‌ముఖుల‌తో ఎంతో సాన్నిహిత్యంగా ఉండడంతో పాటు   న్యూటాలెంట్‌ని ఎంత‌గానో ఎంక‌రేజ్ చేస్తున్నసంగ‌తి తెలిసిందే.

leave a reply