సెల్ఫీ సూసైడ్.. కలకలం..!

కర్నూలు: తనతో పదేళ్లుగా సహజీవనం చేస్తున్న మహిళ… మరొకరితో అనైతికంగా ఉండటాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. తన చావుకు వారిద్దరూ కారణమంటూ సెల్ఫీ వీడియోలో చెప్పి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లాలో జరిగిందీ సెల్ఫీ సూసైడ్.

కర్నూలు జిల్లా సున్నిపెంటలో ప్రసాద్ అనే ఆర్ఎంపీ వైద్యుడి సెల్ఫీ సూసైడ్ కలకలం రేపింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళ… మరొకరితో అనైతిక సంబంధం కలిగివుందన్న విషయాన్ని జీర్ణించుకోలేక… అతను ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోవడానికి ముందు… ప్రసాద్ స్వీయ వీడియో తీసి స్నేహితులకు పంపడంతో… అతని సెల్ఫీ సూసైడ్ ఉదంతం బయటపడింది.

జిల్లాలోని ఆస్పరికి చెందిన ప్రసాద్… సున్నిపెంటలో ఆర్ఎంపీ వైద్యుడిగా ఉన్నాడు. అక్కడే ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసే రాజ్యలక్ష్మి అనే మహిళతో… ప్రసాద్ పదేళ్ల నుంచి సహజీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే ఆమె… బాల రంగారావు అనే వ్యక్తితో అనైతిక సంబంధం పెట్టుకుని… తనను మోసం చేసిందని మనస్తాపం చెందిన ప్రసాద్… తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రసాద్ చనిపోవడానికి ముందు… తన చావుకు రాజ్యలక్ష్మి, ఆమె ప్రియుడు బాల రంగారావు కారణమని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. అంతకుముందు రాజ్యలక్ష్మితో గొడవపడిన అతను… ఆమెను బస్సు ఎక్కించి బంధువుల ఇంటికి పంపాడు. తర్వాత రాత్రివేళ ఇంటికొచ్చి… జరిగిన విషయాన్నంతా సెల్ఫీ వీడియోలో రికార్డు చేశాడు. దాన్ని తన స్నేహితులకు పంపిన తర్వాత… ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రసాద్ సెల్ఫీ వీడియో చూసిన స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో… మరుసటి రోజు ఉదయం ప్రసాద్ సెల్ఫీ సూసైడ్ ఘటన బయటపడింది. తమ ఇంటికి అద్దెకు వచ్చిన రాజ్యలక్ష్మి మాయలో పడిన ప్రసాద్… తన భార్యాపిల్లల్ని కూడా వదులుకుని ఆమెతో వెళ్లాడని మృతుడి తల్లి వాపోయింది.

తనతో సహజీవనం సాగించడానికి ముందు రాజ్యలక్ష్మికి మరో ఇద్దరితో సంబంధం ఉందని ప్రసాద్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. ప్రసాద్ వద్దనున్న డబ్బు, బంగారమంతా రాజ్యలక్ష్మి తీసుకుని… చివరకు ఆయన మృతికి ఆమె కారణమైందని మృతుడి బంధువులు ఆరోపించారు.

ప్రసాద్ సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రాజ్యలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు బాల రంగారావుని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. మొత్తమ్మీద అనైతికం అనర్థానికి దారితీసింది. తన భార్యబిడ్డల్ని వదిలెళ్లిన ప్రసాద్‌కు… తనతో పదేళ్లు సహజీవనం సాగించిన మహిళ నుంచి ఎదురైన మోసం… చివరకు అతడ్ని అంతమయ్యేలా చేసిందని మృతుడి స్నేహితులు, బంధువులు ఆవేదన చెందారు.

leave a reply