ఎవరికీ సాధ్యం కానిది…చైనాకి!

తొలిసారిగా చైనా చంద్రుడికి వెనుక భాగంలో చీకటి ప్రాంతానికి చేరుకొని చరిత్ర సృష్టించింది. చైనా పంపించిన చాంగె-4 ల్యూనార్‌ రోవర్‌ గురువారం విజయవంతంగా చంద్రుడికి అవతలి వైపు దిగింది. అయితే చైనా ఈ వ్యోమనౌకను డిసెంబరు 8న ప్రయోగించగా ఏ రోజు అది విజవంతంగా లక్ష్యాన్ని  చేరింది. ఇప్పటి వరకు చంద్రుడి వెనుక వైపు ప్రాంతానికి అమెరికా, రష్యా సహా ఎవరూ వెళ్లలేకవడంతో  చైనా అడుగుపెట్టి  రికార్డ్ నెలకొల్పింది.

సాధారణంగా భూమి నుంచి చూస్తే  చంద్రుడి ఒక  భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది. వెనుక పైపు కనిపించడం అసాధ్యం. అయితే భూమి గుండ్రంగా తిరిగినట్లు చంద్రుడు కూడా గుండ్రంగా తిరుగుతాడు. అమెరికాకు , రష్యాకు మరియు మిగతా దేశాలకు సంబంధించిన వ్యోమనౌక ఏది ఇంతవరకు  ఆ ప్రాంతంలో  సురక్షితంగా దిగలేదు. అందువల్ల శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి సాధ్యపడలేదు. ఇప్పుడు చైనా అక్కడ వ్యోమనౌకను దింపడంతో పరిశోధనలకు మార్గం సుగమమైంది. చాంగె-4 చంద్రుడిపై దిగిన రోవర్‌ దానిలోని ఓ మానిటర్‌ కెమెరా నుంచి అది దిగిన ప్రదేశాన్ని ఫొటో తీసి పంపించింది. చంద్రుడి మీద దిగి ఫొటోలు పంపినట్లు చైనా వెల్లడించింది. ఈ ఫొటోను చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రచురించింది.

leave a reply