స్పష్టత ఇచ్చిన…ట్రాయ్

ఈ నెల 28 తరవాత ఛానళ్ల నిలిపివేతపై ట్రాయ్ స్పష్టత ఇచ్చింది. వినియోగదారులు ఇప్పటి వరకు చూస్తున్న ఏ చానల్‌ కూడా ఈ నెల 29న ఆపడం జరగదని , ఈ మేరకు కేబుల్ ఆపరేటర్లకు కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే కొత్త నిబంధనలు అమలులోకి రానున్న నేపథ్యంలో   టీవీ చానళ్ల ప్రసారాలకు అంతరాయం ఉండదని టెలికాం నియంత్రణ సంస్థ (టాయ్‌) స్పష్టం చేసింది. ఈ నెల 29 తర్వాత సబ్‌స్రైబ్డ్‌ చానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ట్రాయ్‌  వివరణ ఇచ్చింది.  ప్రతి వినియోగదారుడికి ఇష్టమైన చానళ్లను ఎంపిక చేసుకోవడానికి తగు సమయం ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం చందా దారులు పొందుతున్న ఛానళ్లన్నీ డిసెంబర్ 28 తరవాత కూడా పొందవచ్చని స్పష్టం చేసింది .

అటు కేవలం 100 ఉచిత చానళ్ళు మాత్రమే కోరుకొనే వారు రూ.130+ మరియు జి.ఎస్.టి కలిపి కావలిసిన పరిమిత పే చానళ్ళు కు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. అయితే.. ట్రాయ్‌ ప్రతిపాదించిన ధరలు తమకు ఆమోదయోగ్యంగా లేవని తెలుగు రాష్ట్రాల టీవీ ప్రేక్షకుల సంఘం ప్రతినిధులు తెలిపారు. పెయిడ్‌ చానళ్లకు డబ్బులు కట్టకుండా ఉచిత చానళ్లను మాత్రమే చూడామని సూచించారు.

leave a reply