వైద్యుల వినూత్న…నిరసన!

మణిపూర్ లో డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ఒక సంఘటన చోటుచేసుకుంది. సాధారణంగా తమ డిమాండ్లను తీర్చుకొనేందుకు ప్రతిపక్షాలు, ఉద్యోగులు, ప్రజలు ఏదో ఒక రకంగా ప్రభుత్వం మీద నిరసన చేపట్టడం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌(జేఎన్‌ఐఎంఎస్‌)కు చెందిన కొంత మంది వైద్యులు మాత్రం ఒక నూతన రీతిలో ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగోన్నతి కల్పించాలని వారు ప్రతిరోజు రక్తం దానం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నిత్యం మూడు యూనిట్ల రక్తాన్ని సేకరించి జేఎన్‌ఐఎంఎస్‌ బ్లడ్ బ్యాంకుకు పంపిస్తున్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఇలాగే రక్తం ఇస్తూ ఉంటారట . అంతే కాకుండా కొన్ని డిమాండ్లతో కూడిన ఒక లేఖను కూడా ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రికి పంపించ్చామన్నారు. అయితే వారి నుంచి ఎటువంటి పరిష్కారం దొరకకపోవడంతో మాకు న్యాయం జరిగే వరకు బ్లడ్ బ్యాంకుకు మూడు యూనిట్ల రక్తాన్ని దానం చేస్తూనే ఉంటామన్నారు. ఈ నిరసనలో 50 మంది వైద్యులు పాల్గొంటున్నారు.

leave a reply