అకిరాది.. పవన్‌ బ్లడ్‌నేగా?

అకీరా నందన్ కూడా సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తెలిపారు. అకీరాలో ఉన్నది కూడా పవన్ రక్తమని.. ఆ రక్తంలోనే నటన ఉందని చెప్పారు. అకీరా సినిమాల్లోకి రావడంపై తాను అభ్యంతరం చెప్పనని.. అయితే.. ముందు తన చదువును పూర్తి చేయాలని తెలిపారు. అకీరా వయసు ఇప్పుడు 15 సంవత్సరాలని.. హీరో అయ్యే టైమ్ ఇంకా ఉందని.. అయ్యే టైమ్‌ వచ్చినప్పుడు తప్పకుండా వస్తాడని చెప్పారు. అకీరా పెదనాన్న చిరంజీవి, అన్నయ్య రామ్ చరణ్‌ల ప్రభావం కూడా అకీరాపై ఉంటుందని రేణూ తెలిపారు. కాగా.. రీసెంట్‌గా రేణుదేశాయ్‌ `అన్‌ కండీషనల్‌ లవ్‌’ అనే బుక్‌ను రాసారు. అది వివాదస్పదమవడం గమనార్హం.

leave a reply