వాళ్లంతా…టెస్ట్‌ట్యూబ్‌ బేబీలే!

టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీతోనే కౌరవులంతా జన్మించారని ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతి జి.నాగేశ్వరరావు శుక్రవారంనాడు అన్నాడు. రాముడి కాలం నుంచే టెక్నాలజీ వాడుతున్న ఆధారాలు ఉన్నాయని అయన అన్నారు.  వేలాది ఏళ్ల క్రితం నుంచి గైడెడ్‌ క్షిపణుల గురించి ఉన్న పరిజ్ఞానం భారత్‌కు తెలుసని చెప్పారు. రావణుడి విమానాలు పరిశీలిస్తే లంకలో విమానాశ్రయాలు ఉండేవని అభిప్రాయపడ్డారు.

శ్రీ మహావిష్ణువు శత్రుసంహారం కోసం సుదర్శన చక్రాన్ని వదిలే వారని, లక్ష్యసాధన అనంతరం ఆ చక్రం కాస్తా వెనుదిరిగి వచ్చేదని, అలాగే రాముడు వదిలిన అస్త్రాలు లక్ష్యాన్ని చేరి తిరిగి వచ్చేవని దీన్ని బట్టి చూస్తే గైడెడ్‌ క్షిపణి పరిజ్ఞానం భారత దేశానికి ఏ మాత్రం కొత్తకాదని కొన్ని సంవత్సరాల క్రితమే ఉన్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కౌరవుల మాతృమూర్తి గాంధారి గురించి వివరిస్తూ.. వంద అండాలను వంద కుండల్లో ఉంచి ఫలదీకరించిన మీదటే కౌరవుల జననం జరిగిందని ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో  పేర్కొన్నారు. 

leave a reply