‘డిన్నర్‌’కి పిలిస్తే.. అర్థం చేసుకోవాలి

హీరోయిన్స్‌ను డైరెక్టర్స్‌ డిన్నర్‌కి పిలిస్తే కాస్త అర్థం చేసుకోవాలని బాలీవుడ్‌ నటి షెర్లిన్ చోప్రా వివరించింది. ముంబైలో ఓ మీడియో సమావేశాంలో మాట్లాడుతూ కొన్ని వాస్తవాలను తెలియజేశారు. సాధారణంగా హీరోయిన్స్‌ను డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్‌ నైట్‌ డిన్నర్‌కు పిలుస్తూంటారు. వారు పిలుస్తున్నారు కదా.. అని సంబరపడి వెళ్లారా..! అంతే.. వాళ్లు రమ్మంటున్నది భోజనానికి మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి. ఫిజికల్‌ కంఫర్ట్‌ కోసమేనన్న విషయాన్ని గ్రహించాలని ఆమె పేర్కొన్నారు.

అప్పుడప్పుడు నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అవకాశాల కోసం వెళ్లినప్పుడు వారి ఆఫీసులకు డిన్నర్‌కు పిలిచేవారు. ఏంటి.. అనుకునేదాన్ని.. కానీ మొదట్లో అనుమానం వచ్చేది. ఆ తర్వాత పూర్తిగా అర్థమైంది. దీంతో అప్పటి నుంచి ఆచి తూచి అడుగు వేసేదాన్ని ప్రతిభ కలిగిన డైరెక్టర్స్‌, నిర్మాతలనే కలుసుకోవాలని నిర్ణయించుకున్నా. ఎక్కువగా విలేజ్‌ నుంచి, చిన్న పట్టణాలనుంచి వచ్చిన వారికి ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఎదురవుతాయి అని ఆమె తెలిపారు.

leave a reply