ఏమనుకుంటున్నారు.. తమాషాలా..?

దయచేసి సహకరించండి.. పార్లమెంటు ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు.. ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు.. ఇకనైనా ఆందోళనలు ఆపండి..అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభ్యులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటినుంచీ పార్లమెంట్‌లో సభ్యులు రచ్చరచ్చ చేస్తున్నారు. ఏ ఒక్క అంశాన్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకుంటున్నారు.

కీలక అంశాలపై చర్చలు జరగకుండా సభ్యులు ప్రవర్తిస్తున్న తీరుపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి‌ వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు సభ్యుల ప్రవర్తన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని.. పార్లమెంటు ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని.. ఆయన అన్నారు. దయచేసి సభను సాగనివ్వండి అని ఆవేదన వ్యక్తం చేశారు.  పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభలు పలు అంశాలపై చర్చలు జరగకుండా వాయిదాలు పడుతుండటంపై ఆయన బుధవారం రాజ్యసభలో మాట్లాడారు. మరో ఐదు రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగియబోతున్నాయి, కానీ సభలో దేని గురించి చర్చ జరగకుండా వాయిదాల పర్వం కొనసాగుతోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. డిసెంబరు 11న ప్రారంభమైన శీతాకాల సమావేశాలు ఈనెల 8వ తేదీతో ముగియనున్నాయి.

leave a reply