ఒక్కొక్కరు.. ఒక్కో విధంగా..

గందరగోళంలో ప్రజలు

శుక్రవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్‌ నమోదైందో ఎన్నికల సంఘం ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం ఓటర్లను కలవరపాటుకు గురిచేస్తుంది. ఓటు హక్కుపై రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు అవగాహన కల్పించినా అత్యల్పంగా హైదరాబాద్‌లో పోలింగ్‌ శాతం తగ్గిపోవడం విస్మయానికి గురిచేస్తుంది. పోలింగ్‌ జరిగి 24 గంటలు గడిచినా తుది పోలింగ్ శాతం వివరాలు మాత్రం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. సుమారు 75శాతం పోలింగ్‌ నమోదు కావొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగియగా.. 69.1శాతానికిపైగా పోలింగ్‌ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ ప్రకటించారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర ఈసీ కార్యాలయానికి నివేదికలు చేరలేదు. దీంతో పోలింగ్ శాతం మదింపుపై కసరత్తు ఇంకా కొనసాగుతోంది.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్‌ నమోదైంది. మధిర నియోజకవర్గంలో అత్యధికంగా 91.61శాతం, మునుగోడు, పాలేరులో 90శాతానికి పైగా నమోదు కాగా.. హైదరాబాద్‌లో మాత్రం 50 – 55 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా మలక్‌పేట నియోజకవర్గంలో 41.61శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల్లో 69.5శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి భారీగా పెరిగే అవకాశం కనబడుతోంది.

leave a reply